- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దుల్లకొడుతున్నాం రెడీ అవ్వండి..’ నాగచైతన్య ఉగ్రరూపం
అక్కినేని హీరో నాగచైతన్య(Nagachaithanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’(Thandel).

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య(Nagachaithanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’(Thandel). ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. వరుస అప్‌డేట్స్‌తో సినీ ప్రేమికులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. ‘బుజ్జితల్లి, శివశక్తి’ సాంగ్స్ చాట్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి. అలాగే రీసెంట్‌గా వచ్చిన థర్డ్ సింగిల్ ‘హైలెస్సో.. హైలెస్సా’ కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ సూపర్ హిట్ సాంగ్‌గా నిలిచింది.
ఇప్పుడు ఇదే జోష్‌లో మూవీ టీమ్ ‘తండేల్’ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు. అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న ట్రైలర్ జనవరి 28న రాబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు ‘దుల్లకొడుతున్నాం.. రెడీ అవ్వండి’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇందులో నాగచైతన్య ఓ చేతిలో రక్తపు మరకలు అండిన బకెట్‌ను పట్టుకుని సీరియస్‌గా చూస్తున్నాడు. కాగా.. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.






