- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్‌తో పట్టుబడిన స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్ రిన్సీ ముంతాజ్.. కాల్ డేటాలో సినీ ప్రముఖుల పేర్లు?
కేరళలో భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ బయటపడింది. ప్రముఖ సోషల్ మీడియా స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్ రిన్సీ ముంతాజ్ 3 కిలోల డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టబడి అరెస్ట్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో వెలుగుచూసిన భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ ఇప్పుడు సినీ, సోషల్ మీడియా రంగాలను షేక్ చేస్తోంది. కొచ్చి కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు ఛేదించగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రిన్సీ ముంతాజ్ (Rincy Mumtaz) అరెస్ట్ కావడం కేరళలో హాట్ టాపిక్‌గా మారింది.
రెండోసారి కూడా పట్టుబడి..
గతంలోనూ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రిన్సీ ముంతాజ్, తాజాగా మరోసారి భారీగా డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. రిన్సీ, ఆమె అనుచరుల వద్ద నుంచి పోలీసులు దాదాపు 3 కిలోల ఎండీఎంఏ (MDMA)ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.కోట్లలో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తనకున్న సోషల్ మీడియా ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని రిన్సీ ఈ దందాను నడిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
డేటింగ్ యాప్స్ నుంచి క్రిప్టో వరకు..
ఈ మాఫియా డ్రగ్స్ సరఫరా కోసం అత్యాధునిక పద్ధతులను వాడుతున్నట్లుగా తేలింది. కస్టమర్లను పట్టుకోవడానికి డేటింగ్ యాప్స్‌ను వేదికగా చేసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గూగుల్ పేతో పాటు క్రిప్టో కరెన్సీ (Crypto Currency) ద్వారా లావాదేవీలు సాగిస్తున్నారు. లగ్జరీ హోటళ్లు, ప్రైవేట్ బోట్లలో రహస్యంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తూ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌కు ఐటీ ఉద్యోగులు, ప్రముఖ బిజినెస్‌మెన్లు ప్రధాన కస్టమర్లుగా ఉన్నారు. అయితే, ఈ కేసులో మలయాళ సినీ పరిశ్రమకు ఉన్న సంబంధాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రిన్సీ ముంతాజ్ కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులకు పలువురు సినీ ప్రముఖులు, మోడల్స్ పేర్లు కూడా కనిపించినట్లుగా సమాచారం. అయితే, కేవలం రిన్సీనే కాకుండా, ఈ బడా దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు.. సినీ రంగంలోని ‘పెద్ద తలకాయల’ హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రిన్సీ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కేసులో మరిన్ని కీలక అరెస్టులు జరిగే చాన్స్ కూడా ఉంది.






