- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న స్టార్ హీరో కూతురు.. 13 ఏళ్ల తర్వాత నెరవేరింది అంటూ పోస్ట్
కన్నడ యాక్షన్ హీరో అర్జున్ సర్జా(Arjun Sarja) మనందరికీ సుపరిచితమే. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ యాక్షన్ హీరో అర్జున్ సర్జా(Arjun Sarja) మనందరికీ సుపరిచితమే. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి స్టార్ హీరో రేంజ్‌కి వెళ్లాడు. అంతేకాకుండా ఆయన నటించిన కొన్ని చిత్రాలు తెలుగులోకి డబ్ చేయగా భారీ విజయాన్ని అందుకున్నాయి. అప్పట్లో హీరోగా అలరించిన అర్జున్.. ఇప్పుడు సహాయ నటుడిగా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అర్జున్ సర్జా చిన్న కూతురు అంజనా(Anjana) త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఆమె ప్రియుడితో నిశ్చితార్థం(Engagement) జరిగింది. ఈ విషయాన్ని అంజనా స్వయంగా వెల్లడిస్తూ సోషల్ మీడియా(Social Media)లో నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసింది. ఇక ఆ ఫొటోస్‌కు “అవును.. మీరనుకునేదే.. 13 ఏళ్ల తర్వాత నెరవేరింది” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య(Aishwarya) గతేడాది నటుడు ఉమాపతి రామయ్య(Umapathi Ramaiah)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.






