పాపం ‘స్లమ్ డాగ్’.. బయ్యర్లు లేక ఆగిపోయిన సినిమా!

by Chukka Sudharani |

డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్లమ్ డాగ్’ మూవీ ఆగిపోయినట్లు తెలుస్తుంది.

పాపం ‘స్లమ్ డాగ్’.. బయ్యర్లు లేక ఆగిపోయిన సినిమా!
X

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్స్‌లో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన కథలతో ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందనే చెప్పాలి. గత కొద్ది ఏళ్లుగా ఆయన నుంచి వచ్చే సినిమాలు వరుస పరాజయాలు కావడంతో ఈ డైరెక్టర్ మార్క్ మొత్తం పడిపోయింది. దీంతో ఆయన సినిమా అంటేనే బయ్యర్లు భయపడే స్టేజ్‌కు వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆయన ప్రజెంట్ ప్రాజెక్టు ‘స్లమ్ డాగ్’కు అదే పరిస్థితి ఏర్పడినట్లు సినీ వర్గాల నుంచి టాక్. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ పూరై కూడా రిలీజ్‌కు నోచుకోవడం లేదు. ఈ మూవీని కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రావడం లేదట. అంతే కాకుండా నాన్-థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేయడానికి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఆసక్తి చూపకపోవడంతో, దాని విడుదల అనిశ్చితిలోకి జారింది. అయితే ఈ సినిమాపై మాత్రం పూరి జగన్నాథ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీతో అయినా తన ఫేవరెట్ డైరెక్టర్ మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్న ఫ్యాన్స్‌కు ఇది బిగ్ అనే చెప్పుకోవచ్చు.

Next Story