నీ శరీరం నీ మొగుడికి చూపించు.. పబ్లిక్‌కు కాదు.. ఆట సందీప్ వైఫ్ సంచలన కామెంట్స్

by I. Sairam |

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని హుక్ స్టెప్ సాంగ్ సంక్రాంతి పండుగకు మంచి ఊపు తెచ్చింది.

నీ శరీరం నీ మొగుడికి చూపించు.. పబ్లిక్‌కు కాదు.. ఆట సందీప్ వైఫ్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని హుక్ స్టెప్ సాంగ్ సంక్రాంతి పండుగకు మంచి ఊపు తెచ్చింది. మెగాస్టార్ అంటేనే హుక్ స్టెప్స్‌కి కేరాఫ్ అడ్రస్. ఆయన హుక్ స్టెప్స్ పాయిజన్‌గా ఎక్కేస్తుంటాయి జనాలకి. అలాంటి ఆయనతో హుక్ స్టెప్ సాంగ్‌నే కంపోజ్ చేశారు ఆట సందీప్. చాలా ఏళ్లుగా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆయన.. మెగాస్టార్‌తో స్టెప్‌లు వేయించి తన డ్రీమ్‌ని నెరవేర్చుకున్నారు. అయితే తన వైఫ్ జ్యోతి కూడా ఆట సందీప్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఫేమస్ అయింది. ప్రజెంట్ టీవీ షోల్లో కూడా పాల్గొంటూ ఆడియన్స్‌ను అలరిస్తున్నది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నువ్వు బికినీ వేసుకో.. ఏమైనా వేసుకో కానీ అది భర్త ముందే. నలుగురిలో తిరిగే నీ భర్త గౌరవాన్ని కాపాడేది నీ డ్రెస్సింగే. మనకి మనం నచ్చడం.. నచ్చింది చేయడం ఎంత ముఖ్యమో. మనతో ఉన్న వాళ్లకు కూడా నచ్చేలా ఉండటం అంతే ముఖ్యం. నీ భర్త నలుగురిలో తిరుగుతాడు కాబట్టి వాళ్ల గౌరవాన్ని కాపాడటం మన బాధ్యత. ఎంతసేపూ ఫేమ్, వ్యూస్, పాపులారిటి, నేను అందరిలోనూ కనిపించాలి పాపులర్ అవ్వాలి అదొక్కటే కాదు. వాళ్ల గౌరవాన్ని మనం కాపాడాలి. పోష్‌గా ఉండటానికి వల్గర్‌గా ఉండటానికి చాలా తేడా ఉంటుంది. మోడ్రన్‌గా ఉండటానికి వల్గర్‌గా ఉండటానికి చాలా తేడా ఉంది.

అమ్మాయిలు మోడ్రన్‌గా ఉండటంలో తప్పులేదు. కానీ అది డీసెంట్‌గా ఉండాలి. వల్గర్‌గా ఉండకూడదు. నేను ఫారిన్ కంట్రీస్‌కి వెళ్తాను. అక్కడ చాలా మోడ్రన్‌గా ఉంటాను. పద్ధతిగా చీరలు కట్టుకునే ఉండను. మోడ్రన్ డ్రస్‌లు వేసుకుంటా.. బట్ డీసెంట్‌గా ఉండేట్టు జాగ్రత్త పడతా. రిచ్ ఫ్యామిలీస్‌కి నేనేం చెప్పను. నాలాంటి మధ్యతరగతి వాళ్లకి పెళ్లైన వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే.. మనం ఎక్కడ నుంచి వచ్చాం.. మన పేరెంట్స్ ఎక్కడ నుంచి పెంచారు. మన పద్ధతి, సంస్కారం మర్చిపోకూడదు. పది మందిలోకి వెళ్తే మనం గౌరవంగా ఉండాలి. అది మనకే గౌరవం. ఆ గౌరవం అనేది మన డ్రెస్సింగ్ సెన్స్‌‌పై డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎక్కడ నుంచి వచ్చాం అన్నది గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉంటే మనకి గౌరవం. మన కుటుంబానికి గౌరవం’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story