- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎండైనా నో ‘ట్రబుల్’.. ఫహాద్ ఫాజిల్ డెడికేషన్.. ఫన్నీ వీడియో షేర్ చేసిన టీమ్
మలయాళ ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న స్ట్రైయిట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.

దిశ, సినిమా: మలయాళ ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న స్ట్రైయిట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఇది ఒక క్విర్కీ ఫాంటసీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుండగా.. శశాక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింట్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. షూటింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు మేకర్స్. ఇక వీడియోలో ఎర్రటి ఎండలో నటుడు ఫహాద్ తన చిత్రం షూటింగ్‌లో నిమగ్నమయినట్లు చూపించారు. తీవ్రమైన ఎండ వేడికి చెమటలు కక్కుతున్నా ఆయన డెడికేషన్‌తో పని చేస్తుండగా.. ఆయన అసిస్టెంట్ మాత్రం ఫహద్‌కు గొడుకు పెట్టకుండా తనకు పెట్టుకోవడం, షూటింగ్ గ్యాప్‌లో చిత్ర బృందం కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగుతూ తాపం నుంచి ఉపశమనం పొందడం, సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవడం ఇలా చిత్రీకరణ కష్టాన్ని సైతం ఎంటర్‌టైనింగ్ రూపంలో షూటింగ్ వీడియో రిలీజ్ చేయడంతో ప్రజెంట్ అది వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో లాస్ట్‌లో ‘వేడి గాలుల గురించి చింతించకండి’ అనే క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.






