అంగరంగ వైభవంగా సల్మాల్ ఖాన్ సినిమా స్టార్ట్..

by Chukka Sudharani |

బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అందరి దృష్టి పడింది.

అంగరంగ వైభవంగా సల్మాల్ ఖాన్ సినిమా స్టార్ట్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అందరి దృష్టి పడింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మంగా నర్మిస్తున్న ఈ మూవీలో నయనతారా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అఫీషియల్ అప్డేట్ రాగా.. తాజాగా ముంబైలో అంగరంగ వైభవంగా తన మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో ప్రధాన యాక్షన్ సన్నివేశాలపై దృష్టి సారించి నెల రోజుల పాటు చిత్రీకరణ జరగనుంది. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లిల మధ్య ఇది​మొదటి కలయిక కావడంతో, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని 2027లో థియేటర్లలో ఘనంగా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

Next Story