చియాన్ సరసన యంగ్ హీరోయిన్.. అప్పుడు నిర్మాత ఇప్పుడు హీరోయిన్

by Chukka Sudharani |

చియాన్ విక్రం ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ‘Chiyaan63’ కోసం సిద్ధం అవుతున్నాడు.

చియాన్ సరసన యంగ్ హీరోయిన్.. అప్పుడు నిర్మాత ఇప్పుడు హీరోయిన్
X

దిశ, సినిమా: చియాన్ విక్రం ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ‘Chiyaan63’ కోసం సిద్ధం అవుతున్నాడు. దీనికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ‘ఫస్ట్ ఫ్లేమ్’ పేరుతో టీజర్‌ను సైతం వదిలారు మేకర్స్. ఈ టీజర్‌లో విక్రమ్ విభిన్నమైన లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించిన అప్డేట్ కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో చియాన్ విక్రమ్ సరసన ఓ యంగ్ బ్యూటీని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట మేకర్స్. ఆమె మరెవరో కాదు.. విక్రమ్ ‘వీర ధీర శూరన్’ చిత్రాన్ని నిర్మించిన రియా షిబు. ఇటీవల ఆమె నటించిన మలయాళ చిత్రం ‘సర్వం మాయ’ ఘన విజయం సాధించింది. ఆ విజయం తర్వాత ఇప్పుడు ఆమెకు ‘Chiyaan63’ చిత్రంలో నటించే అవకాశం లభించింది. దాదాపు ఇందులో ఈ యంగ్ బ్యూటీ ఫిక్స్ కాగా.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. కాగా.. ఈ సినిమా షూటింగ్ మే నెల మధ్యలో లేదా చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Next Story