RGV-Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఆర్జీవీ పోస్ట్.. ఏమన్నారంటే?

by Kodari Anjali |   (  Updated:2024-12-13 15:58:44  IST  )

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు

RGV-Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఆర్జీవీ పోస్ట్.. ఏమన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదు(Hyderabad)లోని సంధ్య థియేటర్( Sandhya Theatre) వద్ద జరిగిన ఘటనపై తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) స్పందించారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయినందుకు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Icon star Allu Arjun)ను నిందించడం కరెక్ట్ కాదని అన్నారు. అంతేకాకుండా బెనిఫిట్ షోలను రద్దు చేయడం, స్టార్స్ రావద్దని అనడం సరైంది కాదని తెలిపారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయని.. ఫస్ట్ టైమ్ ఏమి కాదని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా జరుగుతోన్న ఈ తొక్కిసలాటలో వేల సంఖ్యలో మరణించినవారున్నారని పేర్కొన్నారు.

నిర్లక్ష్యం వల్లనా? లేక అసమర్థతనా.. అస్సలు ఈ ఘటన ఏ ఉద్దేశ్యంతో జరిగిందో దర్యాప్తు చేస్తేనే తెలుస్తుందని అన్నారు. ఒకప్పుడు ప్రకృతి వైపరీత్యాల కారణంగా, మరేమైనా జరిగితే .. స్పెషల్ షో లు వేసి మనీని విరాళంగా ఇచ్చేవారని వివరించారు. కానీ ప్రస్తుతం సినిమాకు వచ్చిన అల్లు అర్జున్‌ ఈ ఇష్యూకు కారణం ఎలా అవుతాడని ప్రశ్నించాడు. ఈ షో ల వల్ల ఇతరుకు ఎలాంటి ప్రాఫిట్ లేదని వెల్లడించారు. బెనిఫిట్ షోలు(Benefit shows) అనేకంటే స్పెషల్ షోస్ అనడం కరెక్ట్ అని తెలిపారు’. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్‌లో రాసుకొచ్చిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story