- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Regina Cassandra: ‘అక్కడ ఈ విషయాన్ని పట్టించుకోరు కాబట్టే’.. సాయి ధరమ్ తేజ్ బ్యూటీ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా(Regina Cassandra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కెరీర్ మొదట్లో ఎందరో టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ బ్యూటీ 2019 లో ఏక్ లత్కీ కో దేకా దో చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో అవకాశాలు దక్కించుకుంది. అయితే తమిళంలో ఈ బ్యూటీ నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయినా.. టాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీ నటించిన సినిమాలు భారీ విజయం అందుకున్నాయి.
ఇకపోతే ఈ బ్యూటీ 14 ఏళ్ల వయస్సులోనే నటుడు ప్రసన్న, లైలా జంటా వచ్చిన తమిళ్ మూవీ కంద నాన్ మూలో లైలా సోదరిగా నటించి.. ఆ వయస్సులోనే నెటిజన్ల మనస్సు దోచుకుంది. అలాగే 2012 లో టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ శివ మనసుల శ్రుతి మూవీతో ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాకు రెజీనాకు ఫస్ట్ టైమ్ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. ఇక తెలుగులో కొత్త జంట, రొటీన్ లవ్ స్టోరీ, పవర్, పిల్ల నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శాకిని డాకిని, కార్తీక వంటి మూవీల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. 9 ఏళ్ల నుంచే సినీ కెరీర్ ప్రారంభించానని తెలిపింది. ఇరవై ఐదు ఏళ్లుగా అనేక మూవీల్లో నటించానని.. కాగా పరిశ్రమపై కొంత అవగాహన ఉందని వెల్లడించింది.
అలాగే బాలీవుడ్‌లో దక్షిణాది నటిగా కొనసాగడం ఎంతో కష్టమని, హిందీ మూవీ కోసం ఆడిషన్ కు వెళ్లినప్పుడు హిందీ భాష మాట్లాడుతానా? లేదా అని చూశారని వెల్లడించింది. కానీ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ పట్టించుకోరు కాబట్టి.. టాలీవుడ్, కోలీవుడ్.. ఏ భాషలోని వారైన అనేక మంది నటీనటులు స్టార్లుగా ఎదిగారని తెలిపింది. కానీ ఈ కారణంగా ఎన్నో సినిమా అవకాశాలు కోల్పోయానని ఇంటర్వ్యూలో పేర్కొంది.






