- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rana Daggubati: కొత్తపల్లి పిలుస్తోంది.. థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అప్డేట్ ఇచ్చిన రానా
రానా దగ్గుబాటి సమర్పణలో వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనింగ్ చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’.

దిశ, సినిమా: రానా దగ్గుబాటి (Rana Daggubati) సమర్పణలో వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనింగ్ చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ (Kothapalli Okappudu). ఈ మూవీతో నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి డైరెక్టర్‌గా పరిచయం అయింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించగా.. రిలీజ్‌కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇందులో మనోజ్ చంద్ర, మోనికా టి, ఉషా బోనెల, రవీంద్ర విజయ్, ప్రవీణ పరుచూరి, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్‌సాగర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు రానా. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా.. ఓ పోస్టర్ షేర్ చేశాడు. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (aha) సొంతం చేసుకోగా.. ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించాడు. లింక్






