- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారణాసిలో ప్రకాష్ రాజ్ పాత్ర ఇదే..ఇక చరిత్రలో మిగిలిపోనుంది !
మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారని సమాచారం. ఈ మేరకు ప్రకాష్ రాజ్ కు

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు, జక్కన్న దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ భారీ యాక్షన్ - అడ్వెంచర్ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మెరువనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటివరకు అయితే వీళ్ళ పాత్రలు రివీల్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారని సమాచారం. ఈ మేరకు ప్రకాష్ రాజ్ కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే జక్కన్న దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నాడట. కాగా వారణాసి సినిమా 2027 వేసవిలో రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమాలో ఏకంగా 5 రోల్స్ లో మహేష్ బాబు కనిపించనున్నారని సమాచారం.






