ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. బైకర్ ప్రమోషన్స్‌లో ప్రభాస్.. సినిమాపై మరింత హైప్

by Chukka Sudharani |

శర్వానంద్ నటిస్తున్న బైకర్ చిత్ర ట్రైలర్‌కు సంబంధించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తనదైన శైలిలో ఓ వీడియో రిలీజ్ చేశాడు.

ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. బైకర్ ప్రమోషన్స్‌లో ప్రభాస్.. సినిమాపై మరింత హైప్
X

దిశ, సినిమా: ‘ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అంటున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆయన సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘బైకర్’ మూవీ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిన ఈ పాన్ ఇండియా స్టార్ ఓ స్పెషల్ వీడియో చేశారు. శర్వానంద్ తన ఫ్యామిలీ హీరో అని, ఏప్రిల్ 3న అందరూ బైకర్ సినిమా చూడాలని కోరారు. ఇక బైకర్ ప్రమోషన్స్ కోసం ఏకంగా ప్రభాస్ రంగంలోకి దిగడంతో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం ఆకట్టుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళనాడులో థింక్ స్టూడియోస్ విడుదల చేస్తోంది.

‘ఇక అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు’ అనే క్యాప్షన్‌తో ఓ పోస్టర్ రిలీజ్ చేయగా.. అది ప్రజెంట్ వైరల్ అవుతున్నది. కాగా.. ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ 'బుల్లెట్' సునీల్ అనే కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోలో, భారత రేసర్లు ఓడిపోవడానికి పుట్టలేదని నిరూపించాలనే తపన ఉన్న మాజీ మోటోక్రాస్ రేసర్‌గా రాజశేఖర్ పాత్ర ఆకట్టుకుంది. ఆయన కెరీర్‌లో 18 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లు, 57 సౌత్ జోన్ టైటిల్స్ గెలిచినట్టు చూపించారు. 'బైకర్' చిత్రంలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Next Story