పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి స్టైలిష్ పోస్టర్ రిలీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-01 17:05:48  IST  )

‘ఓజీ’ (OG) బ్లాక్‌బస్టర్‌తో జోరుమీదున్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌‌కు న్యూ ఇయర్ వేళ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టీమ్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది.

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి స్టైలిష్ పోస్టర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఓజీ’ (OG) బ్లాక్‌బస్టర్‌తో జోరుమీదున్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌‌‌కు న్యూ ఇయర్ వేళ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustad Bhagat Singh) టీమ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఆ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే, ఆ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెడ్ షర్ట్, జీన్స్‌లో అదిరిపోయే స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఒక చేత్తో గన్, మరో చేత్తో రేడియో పట్టుకొని నడుస్తూ కనిపిస్తున్నాడు. అయితే, తమ అభిమాన నటుడి మాస్ లుక్ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

కాగా, గబ్బర్‌సింగ్ తర్వాత పవన్, దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం న్యూ ఇయర్ శుభాకాంక్షలతో పాటు, ‘ఈ సమ్మర్‌లో థియేటర్లలో మాసివ్ ట్రీట్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ రిలీజ్ డేట్‌ను కూడా హింట్ ఇచ్చింది. 2026 వేసవిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Next Story