- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: దయచేసి ఆ వార్తలు నమ్మకండి.. పవన్ కల్యాణ్ హీరోయిన్ ట్వీట్
యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ‘సవ్యసాచి’(Savyasachi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో మెప్పించింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ‘సవ్యసాచి’(Savyasachi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత రామ్ పోతినేని(Ram Pothineni), అఖిల్ సరసన నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడు రెండు భారీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ఒకటి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’(Rajasab). దీనిని మారుతి తెరకెక్కి స్తుండగా.. పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మిస్తున్నారు.
అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. దీంతో పాటు నిధి అగర్వాల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలోనూ నటిస్తుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం రత్నవేలు, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. మార్చి 28న విడుదల కాబోతుంది. అయితే నిధి అగర్వాల్ ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ తిరిక లేకుండా గడుపుతోంది. అయినప్పటికీ నిత్యం ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ హైప్ పెంచుతోంది.
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పోస్టులు పెడుతోంది. తాజాగా, నిధి అగర్వాల్ x ద్వారా ఓ పోస్ట్ షేర్ చేసి అందరిని సస్సెన్స్‌లో పెట్టింది. ‘‘హలో నా ట్విట్టర్ ఫ్యామిలీ. గత కొద్ది రోజులుగా సాంగ్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ అవాస్తవాలు నమ్మకండి. ప్రొడక్షన్ అప్‌డేట్ కోసం మాత్రమే వేచి ఉండండి. మంచి రోజులు రాబోతున్నాయి’’ అని రాసుకొచ్చింది. కానీ ఏ సినిమా గురించి అనేది వెల్లడించలేదు. దీంతో అంతా ఆలోచనలో పడ్డారు. నిధి హరిహర వీరమల్లు, రాజా సాబ్ రెండిటీలో ఏ చిత్రం గురించి చెప్తుందో అర్థం కాక ప్రభాస్, పవన్ కల్యాణ్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం నిధి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






