ఇప్పుడు అనిపిస్తోంది.. పుట్టటమే విలన్ పోలికలతో పుట్టానని అంటూ క్రేజీ ఫొటోస్ షేర్ చేసిన స్టార్ యాక్టర్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు(Jagapathi Babu) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.

ఇప్పుడు అనిపిస్తోంది.. పుట్టటమే విలన్ పోలికలతో పుట్టానని అంటూ క్రేజీ ఫొటోస్ షేర్ చేసిన స్టార్ యాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు(Jagapathi Babu) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మొద‌ట్లో హీరోగా న‌టించిన జ‌గ‌ప‌తి బాబు ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అద‌ర‌గొడుతున్నాడు. ముఖ్యంగా విల‌న్‌గా అద‌ర‌గొట్టేస్తున్నాడు. అలా ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వెంటనే ప్రతినాయకుడిగా మారిన మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న ‘పెద్ది’(Peddi) మూవీలో కీ రోల్ ప్లే చేయనున్నాడు.

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా జగపతి బాబు ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో తన పాత ఫొటోతో పాటు ఇప్పుడు ఫొటోను షేర్ చేశాడు. ఇక దానికి.. ‘ఇప్పుడు అనిపిస్తోంది.. పుట్టడమే విలన్ పోలికలతో పుట్టానని’ అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story