- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జయ కృష్ణ ఘట్టమనేని సినిమాలో నరేష్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

దిశ, సినిమా: ఘట్టమనేని మూడో తరంగా ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ. RX 100, మంగళవారం చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అని టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఇందులో ‘జీవితాన్ని తనదైన శైలిలో జీవిస్తూ, ఆస్వాదించే ఒక విలక్షణ పాత్ర.. అనేక వైవిధ్యభరిత పాత్రలతో అలరించే 'నవరసరాయ' నరేష్‌ను ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం నుండి ‘స్వతంత్ర బాబు’గా పరిచయం చేస్తున్నాము .. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో, ఇది మరో మైలురాయిగా నిలిచే పాత్ర కాబోతోంది’ అంటూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ చేతిలో రేడియో, ఓ చేతిలో మందు బాటిల్ పట్టుకుని చిల్ అవుతున్నట్లు కనిపిస్తూ నిజంగా స్వతంత్ర బాబులా అలిరిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టైటిల్ రివీల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే ఇటీవల తిరుపతిలో జరిగిన కీలకమైన మూడో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.






