YouTube Influencer Anvesh: పవన్ కళ్యాణ్ సినిమా చూడకుండానే లక్షన్నర రూపాయలు సంపాదించిన నా అన్వేష్.. ఎలాగంటే?

by Chukka Sudharani |

యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో నా అన్వేష్ ఒకడు.

YouTube Influencer Anvesh: పవన్ కళ్యాణ్ సినిమా చూడకుండానే లక్షన్నర రూపాయలు సంపాదించిన నా అన్వేష్.. ఎలాగంటే?
X

దిశ, సినిమా: యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో నా అన్వేష్ ఒకడు. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న అన్వేష్.. నా అన్వేషణ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా ఎంతో డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇక ఇటీవల బెట్టింగ్ యాప్‌లపై వీడియోస్ చేసి మరోసారి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈయన తన యూట్యూబ్‌లో ఏ వీడియో పెట్టిన అది క్షణాల్లో వైరల్‌గా మారడంతో పాటు భారీగా డబ్బులు వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో షేర్ చేశాడు. ఇందులో.. ‘హరిహర వీరమల్లు’ సినిమా కారణంగా తనకు లక్షన్నర రూపాయలు వచ్చినట్లు తెలిపాడు. ‘‘హరిహర వీరమల్లు’ సినిమా రివ్యూకు నాకు ఎంత డబ్బులు వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు. సినిమా చూడకుండా చెప్తేనే దగ్గరదగ్గర 13 లక్షల మంది చూశారు. అందులో NRI లు ఎక్కువమంది చూడటం కారణంగా ఒక లక్ష 55 వేల రుపాయిలు వచ్చాయి. సినిమా చూడకుండా రివ్యూ చెప్తేనే ఇంత వచ్చాయి. అదే సినిమా చూసి చెప్తే ఇంకెంత వచ్చేవో’ అంటూ చెప్పుకొచ్చాడు.

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం జులై 24న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. క్రిష్, జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఏఎయ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. దీనికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. లింక్


Next Story