- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mrunal Thakur: లవ్ యూ మై బేబీ అంటూ నటుడి ఫొటో షేర్ చేసిన మృణాల్.. లుక్ అదిరిందంటూ పోస్ట్
‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మొదటి సినిమాతోనూ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

దిశ, సినిమా: ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మొదటి సినిమాతోనూ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. తన అందం, నటనతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుని హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక మృణాల్ నటించిన ‘హాయ్ నాన్న’ కూడా ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ఇక తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే మృణాల్ గత ఏడాది ‘కల్కి’ (kalki)సినిమాలో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. మెట్ గాలాలో రెడ్ కార్పెట్‌పై నడిచిన నటుడు దిల్జిత్(Diljit)పై ఓ పోస్ట్ పెట్టింది.
ఆయన సిక్కు మహారాజ్ లుక్‌లో రాయల్‌గా కనిపించిన ఫొటోను షేర్ చేస్తూ ‘‘నాకు చాలా చాలా ఇష్టమైన లుక్. లవ్ యూ మై బేబీ’’ అని రాసుకొచ్చింది. అలాగే హార్ట్ సింబల్‌తో పాటు ఓ పువ్వు ఎమోజీని కూడా షేర్ చేసింది. కాగా, న్యూయార్క్‌లోని మాన్ హట్టన్ లోగల మోట్రోపాలిటన్ మ్యూజియంలో సోమవారం రాత్రి జరిగిన మెట్ గాలా ఈవెంట్‌లో భాగంగా నటుడు దిల్జిత్ దోసాంజ్ స్పెషల్ లుక్‌లో కనిపించాడు. కళ్లలో కోల్, చేతిలో కత్తి, వీపు మీద పంజాబ్ పట్టుకుని ఉన్నాడు. అయితే ఈ వేడుకలో ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, వంటి వారు పాల్గొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.






