- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'లెనిన్' పది రోజుల్లో మొత్తం క్లోజ్
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లెనిన్ చిత్రానికి సంబంధించిన మరో పది రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: అఖిల్ అక్కినేని ప్రస్తుతం 'లెనిన్' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌గా కనిపించనుండగా, మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 26న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన మరో పది రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
అందులో మూడు రోజులు టాకీ పార్ట్ కోసం, మిగతా రోజుల్లో రెండు పాటలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రణాళికలను బట్టి చూస్తే, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మే నెలలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ మూవీ బృందం ఈ చిత్రాన్ని చెప్పిన సమయానికి కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.






