మెగా మనవరాలు క్లింకారా క్యూట్ వీడియో.. కన్‌ఫ్యూజ్ అయిన పొట్టిది.. చెర్రీ దగ్గరకు తీసుకునే సరికి.. నవ్వుతూ (Viral Video)

by Sujitha Rachapalli |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనత సొంతం చేసుకున్నారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కలిగిన అతికొద్ది మంది తెలుగు హీరోలలో ఒక్కడిగా నిలిచాడు.

మెగా మనవరాలు క్లింకారా క్యూట్ వీడియో.. కన్‌ఫ్యూజ్ అయిన పొట్టిది.. చెర్రీ దగ్గరకు తీసుకునే సరికి.. నవ్వుతూ (Viral Video)
X

దిశ, ఫీచర్స్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనత సొంతం చేసుకున్నారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కలిగిన అతికొద్ది మంది తెలుగు హీరోలలో ఒక్కడిగా నిలిచాడు. ఈ వ్యాక్స్ స్టాచ్యు‌లో కేవలం చెర్రీ మాత్రమే కాదు తన పెట్ డాగ్ కూడా ఉండటం విశేషం. కాగా ఈ స్టాచ్యు ఆవిష్కరణ సందర్భంగా తీసుకున్న ఫొటోలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ కాగా తాజాగా మెగా మనవరాలు క్లింకారా వీడియో వైరల్ అవుతోంది.

తండ్రితోపాటు ఫొటో దిగేందుకు స్టేజ్ ఎక్కుతున్న క్లింకారాను ఈ వీడియోలో చూడొచ్చు. అయితే మైనపు విగ్రహంతోపాటు చెర్రీ కూడా కూర్చోగా కన్ఫ్యూజ్ అయిన క్లింకారా.. తండ్రిని కాకుండా విగ్రహాన్ని పట్టుకునేందుకు పరుగెత్తింది. దీంతో వెంటనే చెర్రీ పిలవడంతో తన దగ్గరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఈ క్లిపింగ్ ట్రెండ్ చేస్తూ మురిసిపోతున్నారు. ఎంత క్యూట్‌గా ఉందంటూ పదే పదే రిపీట్ మోడ్‌లో చూసేస్తున్నారు. అనవసరంగా కన్‌ఫ్యూజ్ చేయకండి.. కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ ఏడ్చేస్తా అనేట్లు ఉందంటూ నవ్వుతూ తమ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు.

Next Story