- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ( Karthika Deepam ) ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
దీప.. కాంచన దగ్గరకు వెళ్లి.. ‘మీరైనా వెళ్ళండి అమ్మా ' అని అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే కార్తీక్.. ‘నువ్వు వెళ్లు నువ్వు.. జ్యోత్స్న బాధపడుతుందంట.. వెళ్ళి జ్యూసులు ఇచ్చి, మర్యాదలు చేసి రా... ఇంకా నీకు అర్థం కావడం లేదా? వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమైతే నువ్వు ఇలా మాట్లాడవు.. ఛా’ అని దీప మీద కార్తీక్ ఫైర్ అవుతుంటాడు. దీప పైకి లేచి.. కాంచనతో.. ‘అమ్మా మీరు అయినా అనొచ్చు కదమ్మా’ అని అంటుంది. ‘వచ్చిన మంచి అవకాశాన్ని పాడు చేశారు.. మాటకు మాట సమాధానం చెబుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది? చూడండి ఇప్పుడేమైందో’ అనేసి దీప కూడా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక కాంచన ఏడుస్తూ.. ‘అక్కా ఇప్పుడు నేను దీప కోసమే కదా నేను అక్కడికి వెళ్లను అన్నాను.. నన్ను అర్ధం చేసుకోకుండా నా మీద ఫైర్ అవుతుందేంటీ? అని అనసూయతో చెబుతుంది. ‘అది అంతే అమ్మా.. దాని లెక్క అంతా వేరుగా ఉంటుంది .. మా చావు మేము చస్తాం .. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఏం ఆలోచించకుండా సంతోషంగా వెళ్ళిపోతుంది. తన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు అనుకుంటుందిలేమ్మా.. ఏడ్చి తన బాధను తానే తగ్గించుకుని మళ్ళీ అదే నార్మల్ అవుతుంది .. నువ్వు ఇవేం పట్టించుకోకు చెల్లీ వదిలేయ్.. ’ అని అనసూయ అంటుంది. ఇక సీన్ కట్ చేస్తే శివనారాయణ.. జ్యో, పారుల ముందు పెట్టి కోప పడుతూ ఉంటాడు. ఇక జ్యో దొరికిందే అవకాశం అనుకుని సంబర పడుతూ ఉంటుంది.






