- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kareena Kapoor: 45 ఏళ్ల వయసులో.. కుర్ర హీరోయిన్లు అసూయపడే పని చేసింది
ప్రస్తుతం కరీనా కపూర్ వయస్సు 45 సంవత్సరాలు. అయినా కూడా యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఆమె అందాలను మెయింటైన్ చేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో హీరోలు కొనసాగించిన స్థాయిలో హీరోయిన్లు కెరీర్ను ముందుకు సాగించలేరు, ఇది అనేకమంది విషయంలో ప్రూవ్ అయింది. కొంతమంది బ్యూటీలు మాత్రం చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన స్థాయిలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఒకరు. ఈమె అనేక సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అనేక విజయాలను అందుకొని హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని రేంజ్లో కెరియర్ను ముందుకు సాగించింది. ఈమధ్య కాలంలో ఈమె సినిమాల సంఖ్య తగ్గినా కూడా క్రేజ్ మాత్రం పెద్దగా తగ్గలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వయస్సు 45 సంవత్సరాలు.
అయినా కూడా యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో అందాలను మెయింటైన్ చేస్తుంది. దానితో ఈ నటి అభిమానులు "మా కరీనాకపూర్ కొత్తగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామర్ మెయింటైన్ చేస్తుంది. ఆమెకు నటన విషయంలో కూడా ఎలాంటి డోకా లేదు. అంత గొప్ప హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి దొరకడం హిందీ సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం, ఆమెను చూసి ఇప్పటి హీరోయిన్లు కూడా అసూయ పడుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికీ కూడా కరీనా తన అందాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో చాలా వరకు వైరల్ అవుతున్నాయి. ఇలా 45 ఏళ్ల వయసులో కూడా అదిరిపోయే రేంజ్లో అందాన్ని మెయింటైన్ చేయడం మాత్రమే కాకుండా ఆ అందాలతో కుర్రకారును ఈ బాలీవుడ్ బ్యూటీ ఫిదా చేస్తుంది.






