- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమ.. ఇప్పటికే పిల్లలు కూడా పుట్టేసే వాళ్లు అంటూ క్లారిటీ ఇచ్చిన కంగన
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కంగనా రనౌత్ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చింది ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.

దిశ, సినిమా: ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఇదిలా ఉంటే.. ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కంగన, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా పలు వేదికలపై వీరిద్దరూ కలిసి తరచుగా కనిపిస్తున్నడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఫైర్ బ్రాండ్. ‘చిరాగ్ నాకు చాలా మంచి స్నేహితుడు మాత్రమే. మా మధ్య ఎలాంటి ప్రేమ, రొమాన్స్ లేవు.. ఒకవేళ మీరంతా అంటున్నట్లు మా మధ్య నిజంగా ప్రేమ ఉండి ఉంటే ఇప్పటికి మాకు పిల్లలు కూడా ఉండేవారు’ అని క్లారిటీ ఇచ్చింది. అలాగే గతంలో మేము కలిసి సినిమా చేసినప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతూనే ఉంది, ఇన్నేళ్లుగా మా రిలేషన్‌లో ఎలాంటి మార్పు లేదు, రాలేదు.. అది ఎప్పటికీ ఫ్రెండ్‌షిప్‌గానే కొనసాగుతుంది అని తెలిపింది. కాగా, కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారి స్నేహం అలాగే కొనసాగుతోంది.






