- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వార్ 2 నుంచి బిగ్ అప్డేట్.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్ (NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ (NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ థియేటర్లో కనిపించాలంటే వార్ 2 మూవీ రిలీజ్ కావాల్సిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు... రాబోతోంది.
2019లో వార్ సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 వస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఈ పార్ట్ 2 లో ( War 2) హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మేజర్ కబీర్ దాలివాల్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కు హిందీలో ప్రతి నాయకుడిగా... ఇదే మొదటి సినిమా కావడం విశేషం.
అయితే అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి.... కీలక అప్డేట్ తాజాగా వచ్చింది. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ పోస్ట్ పెట్టారు. వార్ 2 సినిమా వచ్చేస్తోంది. కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఉందంటూ... జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు అలాగే తమిళ్ లో రిలీజ్ కాబోతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.






