క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ 'జెట్లీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

by Chukka Sudharani |

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘జెట్లీ’. ప్ర

క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ జెట్లీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘జెట్లీ’. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్‌‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ డేట్‌ని అనౌన్స్ చేశారు. 'జెట్లీ' ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ సాంగ్ ఏప్రిల్ 2 న రిలీజ్ కానుంది. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ సత్య స్టైలిష్ అవతార్‌ ఆకట్టుకుంది. కాగా.. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. రితేష్ రాణా స్టైల్‌, సిగ్నేచర్‌ హ్యూమర్‌తో పాటు హై-ఎనర్జీ యాక్షన్ మేళవించిన జెట్లీ ఫన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.

Next Story