- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఈ క్యారెక్టర్ చేయగలనని నమ్మిన ప్రతీ ఒక్కరికి థాంక్యూ.. హీరోయిన్ వైరల్ కామెంట్స్
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలో నటించడం తన అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది.

దిశ, సినిమా: హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా వస్తున్న లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైన్ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా.. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ‘గుర్తుందా’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తన పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచి చెన్నై లవ్ స్టోరీ మూవీ మీద చాలా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో కిరణ్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన ఈ చిత్రం తర్వాత మరింత గొప్ప ఇమేజ్ తెచ్చుకుంటారు. అలాగే ఈ మూవీలో ఇంత బరువైన, ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. మణిశర్మ సంగీతంలో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది.






