Ravi Teja : మా అన్నయ్య ‘షష్టి పూర్తి’ చూడండి.. హీరో రవితేజ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

సీనియర్ నటీనటులు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), అర్చన (Archana) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ (Family entertainer) ‘షష్టి పూర్తి’

Ravi Teja : మా అన్నయ్య ‘షష్టి పూర్తి’ చూడండి.. హీరో రవితేజ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: సీనియర్ నటీనటులు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), అర్చన (Archana) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ (Family entertainer) ‘షష్టి పూర్తి’ (Shashti poorthi). రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పవన్ ప్రభ (Pawan Prabha) దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మేస్ట్రో’ ఇళయరాజా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో తొలిపాటను ఆస్కార్ విన్నర్ కీరవాణి రచించగా.. ఇటీవల విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలోనే సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. రెండో పాటను మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించి, యూనిట్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా రవితేజ (Ravi Teja) మాట్లాడుతూ.. ‘మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య ‘షష్టి పూర్తి’ చూడండి.. డెఫినెట్‌గా బావుంటుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. దర్శక నిర్మాతలకు, ఆర్టిస్టులకు అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు. ‘ఇరు కనులు కలిసి మురిసె మొదటి చూపులో.. తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో’ అంటూ సాగే ఈ పాట్ ప్రజెంట్ నెట్టింట ఆడియన్స్‌ను ఆకట్టకుంటోంది.

దీనిపై దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. ‘సినిమాలో చాలా అందమైన యుగళ గీతం ఇది. ఇళయరాజా (Ilaiyaraaja) బాణీ ఇవ్వగానే నాకు ‘సాగర సంగమం’ లో ‘మౌనమేలనోయి’ పాటలాంటి గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది. ఈ ట్యూన్‌కి రెహమాన్ (Rahman) శరవేగంతో సాహిత్యం సమకూర్చారు. ఇళయరాజా ఒక్క కరక్షన్ కూడా చెప్పకుండా ఓకే చెప్పేశారు. ఎస్పీ చరణ్, విభావరితో ఈ పాట పాడించారు. అసలు ట్యూన్ వినగానే నాదీ, రూపేష్ మొహాలు వెలిగిపోయాయి. ఇక మొత్తం పాట రికార్డు అయ్యాక మా మొహాల్లో వెన్నెల కురిసినంత ఆనందం. అసలు ఈ పాట రికార్డింగ్ కూడా చాలా లవ్లీగా, లైవ్లీగా జరిగింది. కథలో సమ్మిళితమైన ఈ పాట, ఈ సినిమాకే కొత్త అందాన్ని, అనుభూతిని తీసుకొచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు.

Next Story