చిరు మూవీలో అవకాశం కోసం హేమ ప్రయత్నం.. అదృష్టం దక్కెనా

by Pulgam srinivas |

హేమ మాట్లాడుతూ... చిరంజీవి తాను నెక్స్ట్‌ చేయబోయే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని మాట ఇచ్చారని, ఇప్పటికే ఈ విషయంపై తన మనుషులతో కూడా కబురు పెట్టినట్లు ఆమె పేర్కొన్నారు.

చిరు మూవీలో అవకాశం కోసం హేమ ప్రయత్నం.. అదృష్టం దక్కెనా
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటి హేమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చాలాకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఈ నటి పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. తాజాగా హేమ ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హేమ మాట్లాడుతూ… చిరంజీవి గారిని కొంతకాలం క్రితం కలిశాను. ఆ సమయంలో తన తదుపరి చిత్రంలో నాకు ఒక మంచి పాత్ర ఇస్తానని చెప్పారు. అలాగే తన మనుషులతో కూడా కబురు పెట్టారని తెలిపారు. దీంతో చిరంజీవి నటించే నెక్స్ట్ మూవీలో హేమ కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా చిరంజీవి ఇప్పటికే ‘విశ్వంబర’ చిత్రాన్ని పూర్తి చేశారు. త్వరలోనే బాబి మరియు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రెండు కొత్త సినిమాలను స్టార్ట్ చేయనున్నాడు.

Next Story