- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gopichand Malineni: రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ హిట్ సినిమా సీక్వెల్ తీస్తానంటూ డైరెక్టర్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ప్రజెంట్ ‘జాట్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ప్రజెంట్ ‘జాట్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ (Bollywood) స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందులో సన్నీ డియోల్ తన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే రాబడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గోపీచంద్ మనినేని మాస్ ‘క్రాక్’ (Krack) సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన ఈ చిత్రం కరోన టైమ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్. ప్రస్తుతం గోపీచంద్ర కామెంట్స్ వైరల్ కావడంతో రవితేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫర్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.






