- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. రాజాసాబ్ నుంచి క్రేజీ అప్ డేట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal star Prabhas) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇక ఆయన నటిస్తున్న మూవీల్లో 'ది రాజా సాబ్' (The Rajasab) ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తోన్నారు. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో డార్లింగ్‌కు జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ మొత్తం ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం, రిలీజ్ వాయిదా పడుతుండడంతో ఫ్యాన్స్‌లో కొంత నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు మేకర్స్ తాజాగా క్రేజీ అప్ డేట్ అందించారు. డిసెంబర్ 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలుపుతూ పోస్టరు విడుదల చేశారు. అలాగే, జూన్ 16న ఉదయం 10:52 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్, రిద్ది కుమార్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.






