జాను లిరి : ఇప్పటికి 2000 ఫోక్ సాంగ్స్ చేశాను.. ఇప్పుడు ఒక్కో పాటకి నా పారితోషికం అదే

by Pulgam srinivas |

తాజా ఇంటర్వ్యూలో జాను లిరి మాట్లాడుతూ... కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈవెంట్లకు 1000 లేదా 1500 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పటివరకు నేను 2000 ఫోక్ సాంగ్స్ చేశాను. ప్రస్తుతం ఒక్కో పాటకి 20 వేల నుండి 50 వేలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

జాను లిరి : ఇప్పటికి 2000 ఫోక్ సాంగ్స్ చేశాను.. ఇప్పుడు ఒక్కో పాటకి నా పారితోషికం అదే
X

దిశ, వెబ్ డెస్క్ : ఫోక్ సాంగ్స్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో జాను లిరి ఒకరు. ఈమె చాలా సంవత్సరాల నుండి ఫోక్ సాంగ్స్ లో నటిస్తూ వస్తుంది. ప్రైవేట్ సాంగ్స్ తో మంచి క్రేజ్ను సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస పెట్టి ఫోక్ సాంగ్స్ చేయడమే కాకుండా టీవీ షోలలో కూడా పాల్గొంటుంది. టీవీ షోల ద్వారా ఈమె తన పాపులారిటీని మరింతగా పెంచుకుంది. అలాగే టెలివిజన్ షోల ద్వారా ఈమె బుల్లితెర అభిమానులను కూడా సంపాదించుకుంది.

తాజాగా జాను ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె తనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. తాజాగా జాను మాట్లాడుతూ... నేను చాలా కాలం నుండి ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నాను. ఇప్పటివరకు నేను దాదాపు 2000 వరకు ఫోక్ సాంగ్స్ చేశాను. కొత్తగా కెరియర్ ప్రారంభించిన సమయంలో ఈవెంట్ కు వెళ్ళినట్లయితే ఒక్కో ఈవెంట్ కు 1000 లేదా 1500 రూపాయలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఒక్కో సాంగ్ కి 20,000 నుండి 50 వేల వరకు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది.

ఈ మధ్యకాలంలో అనేకమంది ఫోక్ డాన్సర్స్ సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. చాలామందితో పోలిస్తే జాను ఫోక్ డాన్సర్ల విషయంలో చాలా ముందు వరుసలో ఉంది. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ వస్తుంది. సోషల్ మీడియాలో కూడా జానుకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈమె అనేక ఫోక్ సాంగ్స్ అవకాశాలను అందుకుంటూ చాలా బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

Next Story