- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధనుష్ ‘కారా’ ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ విఘ్నేష్ రాజా కాంబినేషన్‌లో వస్తున్న ‘కారా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

దిశ, సినిమా: సమ్మర్ స్పెషల్ హై ఎక్స్‌పెక్టేషన్స్ చిత్రాల్లో ‘కారా’ ఒకటి. స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ విఘ్నేష్ రాజా కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. 19-04-2026 న ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా.. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ సినిమాలో ధనుష్ ‘కరసామి’ అనే పత్తి రైతు పాత్రలో కనిపించబోతుండగా.. హీరోయిన్‌గా ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు నటిస్తుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్‌తో పాటు ప్రమోషనల్ కంటెంట్‌తో కూడా ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సమ్మర్ బరిలో ‘కారా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకోబోతుందో వేచి చూడాల్సి ఉంది.






