- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాదంలో చిక్కుకున్న చిన్మయి.. పైరసీని ప్రశంసించడం ముమ్మాటికి నేరమే అంటూ నెటిజన్ల ట్రోలింగ్
ఈ క్లిప్‌ను సింగర్ చిన్మయి రీపోస్ట్ చేస్తూ.. ‘వాట్ ఏ వావ్’ అంటూ ప్రశంసించింది. ఇలా థియేటర్లో పైరసీ చేసిన వీడియోను చిన్మయి షేర్ చేయడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, సినిమా: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లాస్ట్’. ఈ సినిమాను సుభాష్ కె రాజ్ తెరకెక్కించగా.. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా మే 28న విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్స్‌లో రాణిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకే అందులోని ఒక కీలకమైన ఫైట్ సీన్ క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి థియేటర్లో దొంగతనంగా రికార్డ్ చేసిన 54 సెకన్ల వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ, ఒక భయం లేని హీరోయిన్, టాక్సిక్ మేనేజర్ అంటూ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ప్రీతి ముకుందన్ క్యారెక్టర్ క్యాబ్ డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి, తన పక్కన కూర్చుని వేధిస్తున్న వ్యక్తిని దారుణంగా కొట్టే సీన్ ఉంది. ఈ క్లిప్‌ను సింగర్ చిన్మయి రీపోస్ట్ చేస్తూ.. ‘వాట్ ఏ వావ్’ అంటూ ప్రశంసించింది.
ఇలా థియేటర్లో పైరసీ చేసిన వీడియోను చిన్మయి షేర్ చేయడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్న వీడియోనే ఆమె రీషేర్ చేసినప్పటికీ, పైరసీని ప్రోత్సహించడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితమే రిలీజ్ అయిన సినిమా కంటెంట్‌ను ఇలా షేర్ చేయడం అనైతికం అని ఒకరు కామెంట్ చేయగా, దొంగతనంగా షూట్ చేసిన వీడియోపై స్పందించడం నేరమని మరొకరు విమర్శించారు. కొందరైతే ఈ పోస్ట్‌ను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తూ, తమిళనాడు పోలీసుల అఫీషియల్ హ్యాండిల్స్‌ను కూడా ట్యాగ్ చేశారు. ఇక గాయని చిన్మయి ఇటీవల ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష కాంబినేషన్‌లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించిన ‘కరుప్పు’ సినిమాలో త్రిష పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అలాంటి ఒక సీనియర్ సెలబ్రిటీ అయి ఉండి, థియేటర్ పైరసీ క్లిప్‌ను ప్రశంసిస్తూ పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ వివాదంపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది.






