- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2,500 మంది ఆర్టిస్టులతో వందేమాతరం.. నా జీవితంలో చారిత్రక క్షణం : ఎంఎం కీరవాణి
by Naga Rani Yarlagadda |
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని మరో అద్భుత అవకాశం వరించింది. మన జాతీయగీతం వందేమాతరానికి ఈ ఏడాదితో 150 సంవత్సరాలు పూర్తవ్వగా.. ఆ గీతాన్ని జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2500 మంది ఆర్టిస్టులతో ఆలపించేందుకు రెడీ అవుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని మరో అద్భుత అవకాశం వరించింది. మన జాతీయగీతం వందేమాతరానికి ఈ ఏడాదితో 150 సంవత్సరాలు పూర్తవ్వగా.. ఆ గీతాన్ని జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2500 మంది ఆర్టిస్టులతో ఆలపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని కీరవాణి ఎక్స్ వేదికగా ప్రకటించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 150 సంవత్సరాల వందేమాతరంపై కీరవాణి పరేడ్ కి ప్రత్యేక మ్యూజిక్ ను అందించనున్నారు. మన ఐకానిక్ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా.. సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వందేమాతరానికి సంగీత స్వరూపకల్పన చేసే అదృష్టం తనకు లభించిందని తెలిపారు. ఈ మహత్తర ప్రదర్శనకు, చారిత్రక క్షణానికి సాక్షులయ్యేందుకు అందరూ తరలిరావాలని కోరారు. వందేమాతరం ఉత్సవాన్ని కలిసి జరుపుకుందామని పిలుపునిచ్చారు.
Next Story






