- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సబ్స్క్రిప్షన్ పెట్టింది అందుకే.. ఫైనల్లీ క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల
తాను ఇన్‌స్టా వేదికగా సబ్‌స్క్రిప్షన్ పెట్టడం వెనుకున్న అసలు కారణం అదేనంటూ ఫైనల్లీ క్లారిటీ ఇచ్చింది అనన్య నాగళ్ల.

దిశ, సినిమా: వెండితెర, బుల్లితెర అని సంబంధం లేకుండా.. డబ్బులు సంపాదించే దిశలో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు కొందరు నటీమణులు. ఇందుకోసం సోషల్ మీడియాలో కొత్త రూటు ఎంచుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సాగుతున్న ఈ కొత్త తరహా ‘సబ్‌స్క్రిప్షన్’ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దందాలో యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా చేరిన విషయం తెలిసిందే. యాంకర్ విష్ణు ప్రియ సబ్‌స్క్రిప్షన్ ఇష్యూపై చర్చలు జరుగుతున్న క్రమంలోనే అనన్య కూడా అదే దారి ఎంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే అసలు తాను సబ్‌స్క్రిప్షన్ ఎందుకు పెట్టిందో చెప్పుకొచ్చింది. తాజాగా సబ్‌స్క్రిప్షన్ ఎందుకు స్టార్ట్ చేసిందో తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది.
ఈ మేరకు సబ్‌స్క్రిప్షన్ చానెల్‌లో పెట్టిన మెడిటేషన్ వీడియోను షేర్ చేస్తూ.. ‘నిజానికి నేను ఈ సబ్‌స్క్రిప్షన్ పెట్టినప్పుడు ఏమనుకున్నా అంటే.. రెగ్యులర్‌గా మీతో కాంటాక్ట్‌లో ఉండాలి, కనెక్ట్ అవ్వాలి అని. మీతో నేను, అలాగే మనం అందరం కలిసి గ్రో అవ్వాలి అంటే.. నాకు లైఫ్‌లో యూజ్‌ఫుల్ అయిన ఎక్స్‌పీరియన్స్, ప్రాక్టీస్ చేసిన డైలీ రొటీన్స్ మీతో షేర్ చేయాలి, అండ్ మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను. అలాగే సొసైటీకి మంత్లీ ఎంతోకొంత హెల్ప్ చేద్దాం అనేది నా ముఖ్యమైన ఉద్దేశం. 15 డేస్ నుంచి నాకు బాగోలేదు. అందుకే మీతో మాట్లాడలేకపోయాను. ఇప్పుడు షేర్ చేసిన మెడిటేషన్ వీడియో కూడా నా డైలీ రొటీన్‌లో ఒక చిన్న పార్ట్’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. అనన్యకు ముందు నుంచే కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువుంది అంటూ సబ్స్‌క్రిప్షన్ విషయంలో అనన్యకు సపోర్టుగా నిలుస్తు్న్నారు కొందరు నెటిజన్లు.






