ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

by Chukka Sudharani |

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఎపిక్ చిత్రాన్ని ఏప్రిల్ ఎండింగ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
X

దిశ, సినిమా: మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్‌తో అందరి మనసులు దోచుకున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన తొలి గీతం 'సంచారమే' నెట్టింట సూపర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ‘ఎపిక్’ చిత్రాన్ని ఏప్రిల్ 30కి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్. రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30న రిలీజ్‌కు ఉండగా.. దాదాపుగా ఈ చిత్రం వాయిదా పడబోతున్నట్లు తెలుస్తుంది. మేడే, వీకెండ్స్ దృష్టిలో పెట్టుకుని ఇంత మంచి డేట్‌ను వదులుకోకూడదనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అదికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ది వాయిదాతో పలు చిత్రాలే ఏప్రిల్ 30కి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

Next Story