- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటి ట్విషా శర్మ మృతి కేసు.. CBIకి అప్పగించాలని ఎంపీ సర్కార్ నిర్ణయం
మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నటి, మోడల్ త్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో సెన్సేషనల్ అయిన త్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో మోహన్ యాదవ్ (Mohan Yadav) నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు అధికారికంగా ప్రతిపాదించింది. కేసులో పారదర్శకత, నిష్పక్షపాత విచారణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా, గ్వాలియర్ (Gwalior) నగరానికి చెందిన త్విషా శర్మ వివాహం జరిగిన కొద్దిరోజులకే అనుమానాస్పద స్థితిలో మరణించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని, ఆ వేధింపులు తట్టుకోలేకే ఆమె మృతి చెందిందని త్విషా శర్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హై-ప్రొఫైల్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయితే, స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, కేసు తీవ్రత, బాధితుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న సీఎం మోహన్ యాదవ్ కేసును సీబీఐకి అప్పగించడమే భావ్యమని భావించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన సిఫార్సు ఫైలుపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంతకం చేసి కేంద్రానికి పంపింది. కేంద్ర హోంశాఖ, డీపీటీ (DoPT) నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సీబీఐ అధికారికంగా కేసును నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించనుంది.






