నీ ఫేస్‌కి ఆఫర్లు వస్తాయా అన్నారు.. ఆ ఆశతోనే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్నా.. నటి వైరల్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2026-04-01 15:20:30  IST  )

సినీ కెరీర్ స్టార్టింగ్ ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అని తెలిపింది కన్నడ నటి, బిగ్‌బాస్ ఫేస్ రాశిక శెట్టి.

నీ ఫేస్‌కి ఆఫర్లు వస్తాయా అన్నారు.. ఆ ఆశతోనే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్నా.. నటి వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: సినీ కెరీర్ స్టార్టింగ్ ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అని తెలిపింది కన్నడ నటి, బిగ్‌బాస్ ఫేస్ రాశిక శెట్టి. కన్నడలో రెంటు సినిమాలు చేసి మెప్పించిన ఈమె.. తెలుగులో సందేహం చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ మేరకు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశిక శెట్టి కెరీర్ స్టార్టింగ్ ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పుకొచ్చింది. ‘నా జర్నీ చాలా కష్టంగా స్టార్ట్ అయింది. ఆడిషన్స్‌లో ప్రోత్సహంచడం పక్కనపెట్టి.. సూటిపోటి మాటలతో విమర్శించే వాళ్లు. అవకాశాలు ఇచ్చేవారు కాదు. అసలు నీ ముఖానికి గోల్డ్ చైన్ వేసుకునే సీన్ అయినా ఉందా.. అని ముఖం మీదే అనే సరికి చాలా బాధ పడ్డాను. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాను.. నావల్ల అవుతుందా? అని నాలో నేనే మథనపడ్డాను. కొన్ని అవకాశాలు వచ్చి లాస్ట్ మినిట్‌లో చేజారేవి. అప్పుడు మరింత కుంగిపోయాను. అయినా సరే వెనకడుగు వేయాలనుకోలేదు. నాకంటూ ఓ రోజు వస్తుందని ఎదురు చూశాను. ఆ నమ్మకం, ఆశతోనే ఇండస్ట్రీలో అడుగులు వేశాను’ అని చెప్పుకొచ్చింది.

Next Story