ఇంటర్నేషనల్ స్థాయిలో నాలుగు మెడల్స్ సాధించిన టాలీవుడ్ నటి ప్రగతి

by Malleboina Mahesh |

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతున్నారు.

ఇంటర్నేషనల్ స్థాయిలో నాలుగు మెడల్స్ సాధించిన టాలీవుడ్ నటి ప్రగతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నటి ప్రగతి (Actress Pragathi) పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటారు. ఫిట్నెస్, నేషనల్ లెవెల్స్‌లో అనేక పతకాలు సాధించిన ఆమె, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో అదరగొడుతున్నారు. ఇస్తాంబుల్‌లో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ (84KG విభాగం)లో మొత్తం 4 పతకాలు సాధించారు. ఇందులో బెంచ్ అండ్ స్క్వాట్‌లో 2 సిల్వర్ మెడల్స్, డెడ్‌లిఫ్ట్‌లో ఒక గోల్డ్ మెడల్, ఓవరాల్‌గా ఒక సిల్వర్ మెడల్‌ (Silver Medal)ను ఆమె గెలుచుకున్నారు.

నటిగా గుర్తింపు పొందిన ప్రగతి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విజయాన్ని పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, కఠినమైన పవర్ లిఫ్టింగ్ (Powerlifting) క్రీడలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశానికి, తెలుగువారికి గర్వకారణం గా నిలిచిన ఆమె కృషి, అంకితభావం ఎందరికో ఆదర్శనీయం. ఈ ఘన విజయంతో ఆమె ఫిట్‌నెస్ ప్రియులకు, మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారు.

Next Story