- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ బస్టర్ సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూపర్ హిట్ లవ్ స్టోరీ
బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ షూటింగ్ దాదాపు పూర్తి కాగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నది.

దిశ, సినిమా: ‘చాంపియన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ కుట్టి అనస్వర రాజన్.. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. రోషన్ మేక హీరోగా నటించిన ఈ చిత్రంలో అనస్వర నటనకు, డ్యాన్స్‌కు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఇప్పుడు ఈ అమ్మడు తన కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ చిత్రం సీక్వెల్‌తో రాబోతున్నది. సౌత్ ఇండియాలో ఒకప్పుడు సంచలన విజయం సాధించిన ‘7/G బృందావన్ కాలనీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘7/G బృందావన్ కాలనీ 2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రెస్టేజియస్ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత ఈ ప్రేమకథకు కొనసాగింపుగా వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ఫిలిమ్ నగర్ నుంచి అందుకున్న సమాచారం ప్రకారం.. 7/G బృందావన్ కాలనీ 2 చిత్రానికి సంబంధించిన షూట్ 80% కంప్లీట్ కాగా.. దీనికి ఈ సమ్మర్ స్పెషల్‌గా జులైలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నరట మేకర్స్. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా.. మొదటి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణనే ఈ సీక్వెల్‌లో కూడా హీరోగా నటిస్తున్నాడు.






