మంత్రి పేర్ని నానితో సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల చర్చలు

by  |
మంత్రి పేర్ని నానితో సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల చర్చలు
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో టికెట్ల ధరల తగ్గింపుపై చెలరేగిన వివాదం రోజు రోజుకు ముదురుతుంది. ధరలు తగ్గింపుపై వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. అటు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు విమర్శలు చేయడమూ మానడం లేదు. దీంతో రాష్ట్ర రాజకీయాలు సినీ ఇండస్ట్రీ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం అన్నట్లుగా తయారయ్యాయి. ఇదిలా ఉంచితే సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అటు ప్రభుత్వం ఇటు సినీ ఇండస్ట్రీ మధ్య నలిగిపోతున్నారు.

సమస్య నుంచి గట్టెక్కేందుకు సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. మంత్రితో జరిగే ఈ సమావేశానికి 19 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. అలాగే ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చందర్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. సినిమా టిక్కెట్ ధరలు, థియేటర్ల ఇబ్బందులపై చర్చిస్తున్నారు. ఇకపోతే ఆన్‌లైన్ టికెట్ ధరలకు సంబంధించి దాని పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం ఎఫ్డీసీకి అప్పగించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed