స్వగ్రామంలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
స్వగ్రామంలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం స్వగ్రామంలో పర్యటించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గ్రామంలోని పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేస్తామని మాటిచ్చారు. బ్రాహ్మణవెల్లంలలో కొత్త పాఠశాల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అత్యాధునిక వసతులతో కొత్త పాఠశాల భవనం ఉంటుందని చెప్పారు. ఆ పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభం చేయిస్తానని అన్నారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.Next Story

Most Viewed