ICET-2024 RESULTS: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఎంత మంది క్వాలిఫై అంటే?

by Ramesh N |
ICET-2024 RESULTS: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఎంత మంది క్వాలిఫై అంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2024 ఫలితాలు విడుదల చేశారు. ఇవాళ ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి కరుణ ప్రకటించారు. తెలంగాణ ఐసెట్-2024కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77,942 మంది విద్యార్థులు ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు. వారిలో 71, 647 మంది క్వాలిఫై కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. యువకులు 33,928 మంది అంటే 92.18 శాతం క్వాలిఫై అయ్యారు. యువతులు 37,718 మంది అంటే 91.60 మంది క్వాలిఫై అయ్యారు. మరోవైపు ఒక ట్రాన్స్ జెండర్ సైతం క్వాలిఫై అయింది.

లోకల్ విద్యార్థులు 66,104 మంది ఉండగా 5,543 మంది నాన్ లోకల్ విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఎంబీఏ 272 కాలేజీల్లో 35, 949 సీట్లు ఉండగా.. ఎంసీఏ 64 కాలేజీల్లో 6,990 సీట్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐసెట్‌ ప్రవేశ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది. ఐసెట్‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్ చేసి ర్యాంక్ కార్డుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.Next Story

Most Viewed