కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం

by  |
కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. ఇటీవల శివ శంకర్ మాస్టర్, ఆయన పెద్ద కుమారుడికి కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్‌లోని AIG‌ హాస్పిటల్‌లో చేరారు. అయినప్పటికీ వారి ఆరోగ్యం కుదుటపడలేదు. శివ శంకర్ మాస్టర్‌కు ఉపిరితిత్తుల్లో ఏకంగా 75 శాతం ఇన్‌ఫెక్షన్ అయినట్టు వైద్యులు ధృవీకరించారు. పెద్ద కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నాడు.

ఈ విషయాన్ని స్వయంగా శివశంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ ‌వెల్లడించాడు. తన తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. చికిత్స కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయ్యాయని.. అయినప్పటికీ కుదుటపడలేదన్నారు. తదుపరి మెరుగైన చికిత్స కోసం దాతలు సాయం చేయాలంటూ అజయ్ కోరుతున్నాడు. ఈ వార్త విన్న సినీ ప్రముఖులు సైతం శివ శంకర్ మాస్టర్ కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. ఇదే సమయంలో వారి కుటుంబానికి సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.


Next Story