త్రీ మంకీస్‌కు చిరు బ్లెస్సింగ్స్

by  |
త్రీ మంకీస్‌కు చిరు బ్లెస్సింగ్స్
X

త్రీ మంకీస్… సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్, గెటప్ శ్రీనులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం. శుక్రవారం సినిమా విడుదల కానుండడంతో మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ ముగ్గురు. చిరుకు సినిమా ట్రైలర్ చూపించగా చాలా బాగా చేశారని మెచ్చుకున్నారట. సినిమా తప్పకుండా చూస్తానని చెప్పారట. ఈ మాటతో చాలా హ్యాపీగా అనిపించిందని… ఇదే మాకు బిగ్ విక్టరీ అని సంతోషం వ్యక్తం చేశారు త్రీ మంకీస్. అయితే జబర్ధస్త్ సెట్‌లో కోతుల్లా అల్లరి చేసే ఈ ముగ్గురు మెగాస్టార్ చిరు దగ్గర చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో వైరల్ అవుతోంది.

టాలీవుడ్‌కు పెద్దదిక్కుగా మారిన చిరంజీవి దగ్గర సినిమా రిలీజ్‌కు ముందు ఆశీర్వాదం తీసుకునే సెంటిమెంట్ చాలామంది హీరోలకు ఉంది. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ మీట్‌కు హాజరై మహేష్ బాబును బ్లెస్ చేసిన చిరు అశ్వత్థామ సినిమా హీరో నాగశౌర్యకు హృదయపూర్వక ఆశీస్సులు అందించాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ కాగా… త్రీ మంకీస్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంటుందని అంటున్నారు. చిరు బ్లెస్సింగ్ పవర్ అలాంటిది మరి.


Next Story

Most Viewed