రామతీర్థానికి చినజీయర్ స్వామి

44

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పశ్చిమగోదావరి జిల్లాలో దాడులకు గురైన రామతీర్థం ఆలయానికి వెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన మరికాసేపట్లో విశాఖకు బయలు దేరనున్నారు. అక్కడి నుంచి మరల రామతీర్థానికి వెళతారు. ధ్వంసానికి గురైన రాముడి విగ్రహాలను పరిశీలించి, స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. చినజీయర్ పర్యటన నేపథ్యంలో హిందూ సంఘాలు కూడా రామతీర్థానికి చేరుకోనున్నాయని తెలుస్తోంది.