ముప్పు తప్పింది.. మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్

by  |
ముప్పు తప్పింది.. మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా రాకెట్ నియంత్రణ కోల్పోయింది.. ఏ క్షణంలోనైనా భూమి మీద పడొచ్చు.. ఎవరి నెత్తి మీద పడుతుందో తెలియదు.. అన్న న్యూస్ గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెట్టింది. కానీ, అందరికీ ఉపశమనాన్ని కలిగించేలా ఆ రాకెట్ హిందూ మహాసముద్రం, మాల్దీవులకు అతి సమీపంలో కూలినట్లు సమాచారం. దీనికి సంబంధించి చైనా అధికారిక మీడియా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5B భూమిలోకి ప్రవేశించిందని.. శకలాలు తూర్పు రేఖాంశానికి 72.47 డిగ్రీలు, ఉత్తర అక్షాంశానికి 2.65 డిగ్రీల వద్ద కూలాయని స్పష్టం చేసింది. చైనా కాలమానం ప్రకారం ఉదయం 10.24(భారత్ టైమ్ ప్రకారం 8.30 గంటల ప్రాంతంలో) మాల్దీవుల్లో కూలాయని.. సముద్రంలోకి పడకముందే రాకెట్ ముక్కలు.. ముక్కలు అయిందని.. అందులో కొన్ని కాలిపోయినట్టు తెలుస్తోంది.

ఏప్రిల్ 29న భూమి నుంచి బయలుదేరిన లాంగ్ మార్చ్ 5B రాకెట్.. తిరిగివచ్చే సమయంలో నియంత్రణ కోల్పోయింది.అప్పటి నుంచి ఏ ప్రాంతంలో పడుతుందో ఏమోనని సైంటిస్టులు తలలు పటుకున్నారు. ఇటువంటి సమయంలో ఆదివారం హిందూ మహాసముద్రంలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Next Story

Most Viewed