జూపార్క్‌లోని ఏకైక చింపాంజి మృతి..

by  |
జూపార్క్‌లోని ఏకైక చింపాంజి మృతి..
X

దిశప్ర‌తినిధి,హైద‌రాబాద్ : రాజేంద్రనగర్‌లోని నెహ్రూ జులాజిక‌ల్ పార్క్‌లో ఉన్న ఏకైక చింపాంజీ సుజీ గుండెపోటుతో గురువారం ఉద‌యం మరణించింది. సుజీ వ‌య‌స్సు 35ఏండ్లు. ఉద‌యం 8.30 గంట‌ల ప్రాంతంలో నేల‌పై అచేత‌నంగా ప‌డియున్న సుజీని జూ పార్క్ సిబ్బంది గుర్తించి అధికారుల‌కు సమాచారమిచ్చారు. ఆ వెంటనే 9 మంది ప‌శు వైద్యులు అక్క‌డకు చేరుకుని సుజీని ప‌రిక్షించారు. అప్పటికే చింపాంజి చనిపోయిన‌ట్లు గుర్తించి జూ అధికారుల‌కు చెప్పారు.

అనంత‌రం పోస్టుమార్టం చేయగా గుండె పోటుతో ప్రాణాలు వదిలిందని వైద్యులు వివరించారు. ఈ సంద‌ర్భంగా క్యూరేట‌ర్ మాట్లాడుతూ.. బుధ‌వారం వ‌ర‌కు పండ్లు, మొలకలు, రసాలు, కొబ్బరి నీళ్ళు తాగింద‌న్నారు. అప్పుడు అనారోగ్యంతో కూడా కనిపించలేదని తెలిపారు. జూ పార్క్ లో 2012 లో కూడా ఓ చింపాంజి మృత్యువాత పడినట్లు వెల్లడించారు.స్వేచ్చ‌గా తిరుగ‌లేని చింపాంజీల జీవిత కాలం 39ఏండ్లు క్యూరేట‌ర్ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed