అమలుకు నోచుకోని చిల్పూరు వెంకన్న ఆలయం

by  |
అమలుకు నోచుకోని చిల్పూరు వెంకన్న ఆలయం
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: చిల్పూర్ మండల కేంద్రంలోని గుట్టపై వెలసిన బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయానికి 14 వందల ఏళ్ల చరిత్ర ఉంది. పెద్ద పెద్ద రాతి బండలతో ఆలయాన్ని నిర్మించారు. స్థానికులతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్న భక్తుల కోరిక నేటికీ నెరవేరట్లేదు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు రోజువారీ దర్శనాలు వార మాస కల్యాణాలతో నిత్యం భక్తులు దర్శించుకునే చిలుపూరు బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని రెండో తిరుపతిగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు.

స్థలం పురాణం..

పూర్వంలో వెంకటేశ్వర స్వామి- పద్మావతితో జరిగిన కళ్యాణ మహోత్సవం సందర్భంగా కుబేరుని నుండి అప్పు తీసుకొని తీర్చలేక భయంతో తిరుపతి కొండపై నుండి వచ్చి చిలు పూరు గుట్టపై పాదాలు మోపి గుహలో దాక్కున్న టు చరిత్ర ఉంది. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని ఏలుతున్న కాకతీయ రాజులు స్థానిక ప్రజల సమాచారం మేరకు స్వామి వారు వెలసిన చోట పూజలు చేయడం ప్రారంభించారు. 14వ శతాబ్దంలో గుట్ట కింది భాగం పెద్ద పెద్ద రాతి బండలతో ఆలయాన్..

రాతి బండలతో..

పెద్ద పెద్ద రాతి బండలతో ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుండి నిత్య పూజలు అందుకుంటున్న స్వామివారి ఆలయం శిథిలావస్థకు చేరడంతో భక్తులు ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భక్తుల విరాళాలు, దేవాదాయ శాఖ అందించిన నిధులతో ఆలయాన్ని నిర్మించి ఆగమశాస్త్రం ప్రకారం చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాటి నుండి గత 20 ఏళ్లుగా దైవ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడం.. నిత్య పూజలు, వ్రతాలు, కల్యాణ మహోత్సవాలతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది.

నిత్య పూజలు..

బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యారాధనతో పాటు అభయాంజనేయ స్వామి దర్శనం, నవగ్రహ పూజ, సత్యనారాయణ స్వామి పూజలు, గోదాదేవి కల్యాణం, ఉత్తరద్వార దర్శనం, వార, మాస కల్యాణోత్సవాలతో నిత్యం పూజలు జరుగుతాయి.

కాటేజీల్లో సౌకర్యాలేవీ?

కోసం గుడి దిగువన దాతల విరాళాలతో నిర్మించిన కాటేజీల్లో రక్షిత మంచి నీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదు. భక్తుల తాకిడి పెరుగుతున్న దేవస్థానం వద్ద కోతుల బెడద అధికంగానే ఉంది. దైవదర్శనానికి వచ్చే భక్తులు పూజా సామాగ్రితో ఆలయంలోకి వెళ్లాలంటే భయం భయంగా వెళ్లాల్సిందే. దీంతో భక్తులు దైవదర్శనానికి వెళ్లాలంటే జంకుతున్నారు.

నిలిచిన మండప నిర్మాణం..

భక్తుల సౌకర్యార్థం ఏడేళ్ల కిందట దాదాపు రూ. 35 లక్షలతో చేపట్టిన కాలక్షేప మండపం నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దర్శనానికి వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు కావాల్సిన వసతులతో నిర్మించే ఈ కాలక్షేప మండపం నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.

ఇరుకు ఘాట్ రోడ్డు..

ఎత్తైన కొండపై వెలసిన స్వామివారి పాదాలను దర్శించుకునేందుకు, దిగువన ఉన్న ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లే భక్తులు వాహనాల్లో ఆలయ ప్రధాన ద్వారం వరకు వెళ్లేందుకు వీలుగా ఉన్న ఘాటు రోడ్డు ఇరుకుగా ఉంది. దీన్ని విస్తరించడంతో పాటు విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

భక్తుల సహకారంతో..

భక్తుల సహకారంతో వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి చేస్తున్నాం. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం అందించే తోడ్పాడుతో ఆలయంలో సౌకర్యాలు కల్పిస్తున్నాం.

-ఈవో, లక్ష్మీప్రసన్న

Next Story

Most Viewed